NIRDPR: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసారా…? అయితే మీకో సువర్ణావకాశం..!

-

ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వాళ్ళకి శుభవార్త. మీరు NIRDPR లో ఉద్యోగం పొందొచ్చు. దీనికి సంబంధించి వివరాలు మీకోసం. ఇక పూర్తిగా చూస్తే… NIRDPR లో ఉద్యోగం పొందాలి అంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. అలానే క్యాట్‌కు సంబంధించిన కోర్టు లో లేదా హైకోర్టు లో మూడేళ్లకు పైగా అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేసిన అనుభవం ఉండాలి.

అలానే తప్పక ఇంగ్లిష్, హిందీలో (చదవడం / రాయడం / ట్రాన్స్‌లేషన్‌) ప్రొఫిషియన్సీ ఉండాలి గమనించండి. ఇక వయసు విషయానికి వస్తే… వయసు తప్పక 25 ఏళ్లు పైన ఉండాలి. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇచ్చిన చిరునామా కి అప్లికేషన్ పంపాల్సి వుంది. దరఖాస్తులకు చివరి తేది మార్చి 20, 2021. ఇక ఎంపిక విధానం గురించి చూస్తే… దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని స్క్రుటినైజ్‌ చేసి, అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు.

ఆ తరువాత షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో తెలియజేస్తారు అని చెప్పారు. పూర్తి సమాచారం కోసం www.nirdpr.org.in ని సంప్రదించండి. దరఖాస్తును అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, రాజేంద్ర నగర్, హైదరాబాద్‌-500030 చిరునామాకు పంపాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version