నిరుద్యోగులకు శుభవార్త.. NIRDPRలో 510 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)లో 510 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలో మరియు క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ పోస్టులు ఉన్నాయి. మయో పరిమితి పోస్ట్‌ను బట్టి మారుతుందని, 01 జనవరి 2020 వరకు పరిగణలోకి తీసుకుంటారని నోటిఫికేషన్‌లో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ nirdpr.org.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఖాళీ వివరాలు – ఖాళీలు

పోస్టు: స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్

ఖాళీలు : 10
అర్హతలు : పీజీలో ఎకనామిక్స్/రూరల్ డెవలప్మెంట్ లేదా రూరల్మేనేజ్మెంట్ /పొలిటికల్ సైన్స్, సోషియాలజీ/సోషల్ వర్క్ తత్సమాన కోర్సుల్లో ఏదైనా ఒకదానిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీ మాట్లాడం, రాయడంలో ప్రావీణ్యత ఉండాలి.
జీతం : రూ.35,000/-
వయో పరిమితి : కనిష్టంగా 30 సంవత్సరాలు మరియు గరిష్టంగా 50 సంవత్సరాలు

పోస్టు: యంగ్ ఫెలో

ఖాళీలు : 250
అర్హతలు : పీజీలో ఎకనామిక్స్/రూరల్ డెవలప్మెంట్ లేదా రూరల్మేనేజ్మెంట్ /పొలిటికల్ సైన్స్, సోషియాలజీ/సోషల్ వర్క్ తత్సమాన కోర్సుల్లో ఏదైనా ఒకదానిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీ మాట్లాడం, రాయడంలో ప్రావీణ్యత ఉండాలి.
జీతం : రూ.35,000/-
వయో పరిమితి :కనిష్టంగా 25 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు

పోస్టు: క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్

ఖాళీలు: 250
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్హెచ్జీ గ్రూప్ లీడర్లో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
హిందీ, ఇంగ్లిష్తోపాటు స్థానిక భాషలో ప్రావీణ్యత ఉండాలి.
జీతం : రూ.12,5000/-
వయో పరిమితి : గరిష్టంగా 40 సంవత్సరాలు

చివరి తేదీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 ఆగస్టు 2020.
వెబ్సైట్: nirdpr.org.in
http://nirdpr.org.in/nird_docs/vacancies/job240720.pdf