పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఇది మీకు శుభవార్త. పోస్ట్ ఆఫీసుల్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

Postoffice

పశ్చిమ బెంగాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఖాళీగా ఉన్న పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), పోస్ట్‌మ్యాన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను పోస్ట్ ఆఫీసులు, సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్, రైల్వే మెయిల్ సర్వీస్‌లో వున్నాయి.

మొత్తం 124 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 24 చివరి తేదీ. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు కూడా ఉండాలి. కేవలం క్రీడల్లో రాణించిన వాళ్ళే అప్లై చేసుకోవాల్సి వుంది. ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. క్రీడార్హతని చూస్తే.. రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున జాతీయ, అంతర్జాతీయ క్రీడలు, గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌ లో పాల్గొనాలి. నేషనల్ స్పోర్ట్స్‌లో స్టేట్ స్కూల్ టీమ్స్ నుంచి పార్టిసిపేట్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ ని కింద అడ్రస్‌కు 2021 డిసెంబర్ 24 లోగా పోస్టులో పంపాలి.

The Assistant Director (Recruitment), Office of the Chief Postmaster General, West Bengal Circle, P-36, CR Avenue,Yogayog, Bhawan,Kolkata – 700012.

Read more RELATED
Recommended to you

Exit mobile version