రైల్వే సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. కోర్సు పూర్తి చేసి శిక్షణ తీసుకున్నా, ఏడాదికి పైగా అనుభవం ఉన్నా ఈ అప్రెంటీస్ పోస్టులకు అర్హులు కాదు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి.

train

టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. వయస్సు విషయానికి వచ్చేస్తే.. 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వెబ్‌సైట్ https://www.ircon.org/ లో తెలుసుకోవచ్చు.

ఇక ఖాళీలు విషయానికి వస్తే.. మొత్తం ఖాళీలు- 32, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 19, సివిల్ ఇంజనీరింగ్- 12, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 4, ఎస్ అండ్ టీ ఇంజనీరింగ్- 3, టెక్నీషియన్ అప్రెంటీస్- 13, సివిల్ ఇంజనీరింగ్- 8, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 3, ఎస్ అండ్ టీ ఇంజనీరింగ్- 2.

విద్యార్హతలు చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. స్టైపెండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.10,000, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.8,500. శిక్షణా కాలం ఒక ఏడాది. అభ్యర్థులు https://www.ircon.org/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news