నిరుద్యోగులకు శుభవార్త… భారతీయ రైల్వేలో 165 పోస్టులు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే లో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌ లో ఐటీఐ పాస్ అయిన వారు అప్లై చేయొచ్చు. మొత్తం 165 పోస్టుల్ని ప్రకటించింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ మొదలన పోస్టులు వున్నాయి.  అప్లై చేయడానికి 2021 మార్చి 30 చివరి తేదీ. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయ్యి పోయింది. పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ‌లో తెలుసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే….ఫిట్టర్- 45, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 28, ఎలక్ట్రీషియన్- 18, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 8.

సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 5, పెయింటర్ (జనరల్)- 10, కార్పెంటర్- 20, ప్లంబర్- 8, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2, టైలర్ (జనరల్)- 5, మెకానిక్ (డీజిల్)- 7, మెకానిక్ (ట్రాక్టర్)- 4, ఆపరేటర్ (అడ్వాన్స్‌డ్ మెషీన్ టూల్)- 5. దరఖాస్తు ఫీజు రూ.170. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.70. వయస్సు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news