స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ కోచ్‌ల ఉద్యోగాలు!

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) వివిధ క్రీడా విభాగాల్లో అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

 

Jobs in SAI

ఖాళీల వివరాలు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే ముందు క్షుణ్నంగా చదివి అప్లై చేయాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.sportsauthorityofindia.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఎంపికైన వారిని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 4 ఏళ్ల పాటు అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్‌ వ్యవధిని పొడిగిస్తారు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం 220 పోస్టుల్లో జనరల్‌ అభ్యర్థులకు 90, ఈడబ్ల్యూఎస్‌కు 22, ఓబీసీలకు 59, ఎస్‌సీలకు 33, ఎస్టీలకు 16 పోస్టులను రిజర్వ్‌ చేసినట్లు సాయ్‌ పేర్కొంది.

అర్హతలు..

ఏదైనా ఇతర గుర్తింపు పొందిన భారతీయ/ విదేశీ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత క్రీడాంశంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఒలింపిక్‌/ఇంటర్నేషనల్‌ పోటీల్లో పాల్గొని ఉండాలి. లేదంటే ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయి ఉండాలి. 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు.

ఎంపిక ..

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలించి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మెరిట్‌ లిస్ట్‌ సిద్ధం చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. తద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.