భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తోపాటు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో విమర్శల జోరు పెంచారు. ఈ క్రమంలోనే రాహుల్ తాజాగా ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందని, మరి ప్రజలైన మీ ఆదాయం పెరిగిందా ? అని రాహుల్ ప్రశ్నించారు.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఎల్) నివేదిక ప్రకారం 2018-19లో బీజేపీ ఆదాయం రూ.2410 కోట్లు ఉండగా, 2019-20లో అది 50 శాతం అంటే.. రూ.1213 కోట్లు పెరిగి రూ.3623 కోట్లకు చేరుకుంది. దీనిపైనే రాహుల్ ప్రశ్నలు వేశారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం తగ్గింది.
BJP’s income rose by 50%.
And yours?BJP की आय 50% बढ़ गयी।
और आपकी? pic.twitter.com/Q5HEISACDJ— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2021
2018-19లో కాంగ్రెస్ పార్టీ ఆదాయం రూ.918 కోట్లు ఉండగా 2019-20 వరకు అది 25 శాతం తగ్గి అంటే.. రూ.236 కోట్లు తగ్గి రూ.682 కోట్లుకు చేరుకుంది. ఇక కాంగ్రెస్ మిత్ర పక్ష పార్టీ ఎన్‌సీపీ ఆదాయం కూడా 68 శాతం పెరిగింది. 2018-19లో ఎన్‌సీపీ ఆదాయం రూ.50 కోట్లు ఉండగా, 2019-20లో అది రూ.85 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ బీజేపీ ఆదాయంపై విమర్శించారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఆదాయం పెరిగింది కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదని అన్నారు. పైగా ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన #Indiaonsale అనే హ్యాష్ ట్యాగ్ పేరిట పోస్టులను ట్వీట్ చేశారు.