టీఎస్ ఎడ్‌సెట్-2019 నోటిఫికేషన్ విడుదల

-

– బీఈడీలో ప్రవేశాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) నోటిఫికేషన్ విడుదలైంది.

– టీఎస్ ఎడ్‌సెట్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) తరపున ఓయూ టీఎస్ ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తుంది.

కోర్సు : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)
కోర్సు వ్యవధి: రెండేండ్లు
మెథడాలజీ: మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయా-లజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోర్సులను బట్టి సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ), బీఎస్సీ (హోం సైన్స్) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ/ఇంజినీరింగ్ (సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో) 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2019 ఏప్రిల్/మేలో డిగ్రీ పూర్తి చేస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2019 జూలై 1 నాటికి 19 ఏండ్లు నిండి ఉండాలి. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో 15 రీజినల్ కేంద్రాలతో-పాటు ఏపీలో 3 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా

బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులు. పరీక్షను 120 నిమిషాలలో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.

టీఎస్ ఎడ్‌సెట్‌లో మొత్తం మార్కుల్లో (150 మార్కులు) కనీసం అర్హత మార్కులు 38 (25 శాతం) రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.

పరీక్ష విధానం:

పార్ట్ ఏ-జనరల్ ఇంగ్లిష్-25 మార్కులు
పార్ట్ బీ-జనరల్ నాలెడ్జ్-15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-10 మార్కులు
పార్ట్ సీ-మెథడాలజీ-100 మార్కులు
కింది వాటిలో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా మెథ-డాలజీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బీ విభాగాలు అందరికి కామన్‌గా ఉంటాయి. పార్ట్ సీ (మెథడాలజీ) మాత్రమే వేర్వేరుగా ఉంటుంది.
మ్యాథమెటిక్స్-100 మార్కులు
ఫిజికల్ సైన్సెస్-100 మార్కులు (ఫిజిక్స్-50 , కెమిస్ట్రీ-50)
బయాలజికల్ సైన్సెస్-100 మార్కులు (బాటనీ-50, జువాలజీ-50)
సోషల్ స్టడీస్-100 మార్కులు (జాగ్రఫీ-35, హిస్టరీ-30, సివిక్స్-15, ఎకనామిక్స్-20)
ఇంగ్లిష్ -100 మార్కులు

ముఖ్యతేదీలు:

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 10
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.650/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450/-
ఎడ్‌సెట్ పరీక్ష: మే 31, (ఉదయం 11 – 1 గంట వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు)
వెబ్‌సైట్: http://edcet.tsche.ac.in

Read more RELATED
Recommended to you

Exit mobile version