యూపీపీఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్రానికి సంబంధించి దాదాపు వందకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివిధ విభాగాల్లోని ఖాళీలు ఇలా ఉన్నాయి. హార్టికల్చర్, ఫుడ్, సోషల్ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ డివిజన్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ల ఖాళీల భర్తీకి ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ దరఖాస్తు ప్రక్రియ జూలై 5 వరకు కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు –www.uppsc.up.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్డేడ్ చేయనున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. తదుపరి వివరాలకు కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను చూసుకోవచ్చు.
విద్యార్హతలు
ఈ నోటిఫికేషన్‌లో కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ అర్హతగా మరికొన్ని పోస్టులకు పీజీ పూర్తి చేయాలని బోర్డు తెలిపింది. వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థి వయస్సు 21 – 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మొత్తం 102 ఖాళీలుండగా. ఓపెన్ కేటగిరీ 42, ఓబీసీ 27, ఎస్సీ 22, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 10 పోస్టులు కేటాయించారు. ఇక, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లలో మొత్తం 4 ఖాళీలున్నాఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ డిపారŠెట్మంట్లో మొత్తం రెండు ఖాళీలున్నాయి. ఈ ఖాళీల భర్తీకి జూన్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 1లోపు ఫీజు చెల్లించాలి. జూలై 5వ తేదీ లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సబ్మిట్ చేయాలి. మరిన్ని వివరాలకు పైన చెప్పిన వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల!