రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 926 అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఈ అర్హత చాలు

-

నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అతిపెద్ద శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఏకంగా 926 అసిస్టెంట్ పోస్టుల్ని ప్రకటించింది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్‌బీఐ. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో కూడా ఖాళీలున్నాయి. ఆర్‌బీఐలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది.

ఆసక్తిగల అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి మరిన్ని వివరాలు చూడొచ్చు. పోస్టులవివరాలు: మొత్తం ఖాళీలు- 926. ఇందులో అహ్మదాబాద్- 19, బెంగళూరు- 21, భోపాల్- 42, భువనేశ్వర్- 28చండీగఢ్- 35, చెన్నై- 67, గువాహతి-55, హైదరాబాద్- 25, జైపూర్- 37, జమ్మూ- 13, కాన్పూర్ అండ్ లక్నో- 63, కోల్‌కతా- 11, ముంబై- 419, నాగ్‌పూర్- 13, న్యూఢిల్లీ- 34, పాట్నా- 24, తిరువనంతపురం అండ్ కొచ్చి- 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆర్హ‌త‌: అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాసైతే చాలు.

వయసు: 01.12.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.12.1991 – 01.12.1999 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల- 2019 డిసెంబర్ 23
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 డిసెంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 16

ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2019 డిసెంబర్ 23 నుంచి 2020 జనవరి 16
దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2020 జనవరి 16
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 జనవరి 31

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version