LICలో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో గడువులోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు – 200 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ – 12, తెలంగాణ – 31 పోస్టులున్నాయి. మిగతావి ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.800 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 15 కాగా.. పరీక్ష సెప్టెంబర్లో ఉండనుంది.

ఇలా దరఖాస్తు చేస్కోండి..

అభ్యర్థులు ముందుగా ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్సైట్ https://www.lichousing.com/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజ్లోని Careers ఆప్షన్పై క్లిక్ చేయాలి.

LIC HFL Junior Assistant Notification 2024 లింక్పై క్లిక్ చేయాలి.

దరఖాస్తు ఫారమ్లో మీ వ్యక్తి, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.

అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.

అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version