Job Notification : ఎస్బీఐలో 1040 SCO పోస్టులు భర్తీ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్షిప్ మేనేజర్ – 273 పోస్టులు, వీపీ వెల్త్ – 643, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) – 32 , రీజినల్ హెడ్ – 6, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ – 30, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ – 49, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రోడక్ట్ లీడ్) – 2, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) – 2, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) – 1, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) – 2, ఇలా మొత్తం 1,040 పోస్టులకు నోటీఫికేషన్ జారీ చేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

  • అభ్యర్థులు ముందుగా https://sbi.co.in/web/careers వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • ఎస్బీఐ SCO Apply Online లింక్పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version