ఘాటెక్కిన ఉల్లి..కోయకుండానే వినియోగదారులకు కన్నీళ్లు

-

కూరగాయల్లో మహారాణిగా పిలిచే ఉల్లి ఘాటెక్కింది..కోయకుండానే నినియోగదారులను ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది.. వారం రోజులుగా ఉల్లి ధరలు కొండెక్కుతున్నాయి..సమీప భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజన్ లోనే ధరలు మండుతున్నాయంటే, దిగుబడులు పూర్తయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న టెన్షన్ వినియోగదారుల్లో నెలకొంది..దేశంలోనే ఉల్లి అత్యధికంగా సాగుచేసే కర్నూలు, మహారాష్ట్రలో ఈ సీజన్‌లో ఉల్లి వేల ఎకరాల్లో సాగు చేసినప్పటీకీ..దిగుబడి గణనీయంగా తగ్గింది..ఎకరాకు 5,10క్వింటాళ్లు దిగుమతి మాత్రమే వచ్చింది. దీనికి తోడు అధిక వర్షాలు ఉల్లి పంటను ఘోరంగా దెబ్బతీసాయి. దీంతో ధరలు వినియోగదారునికి భారంగా మారాయి. దీంతో నవంబరు మొదటి వారం నాటికి ఉల్లి దిగుబడులు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఆ తరువాత ఉల్లి ధర భారీగా పెరగనుంది . ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేసి తక్కువ ధరకు విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు..ఉల్లి ధర రాబోయే రోజుల్లో మరింత భారమవుతుందంటున్నారు వ్యాపారులు. వచ్చే ఏడాది మార్చి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. మార్కెట్‌లో రైతులు విక్రయించే ఉల్లి ధరలకు, వ్యాపారులు విక్రయించే దానికి చాలా తేడా ఉంది. దళారులే ధరలను పెంచుతున్నారని సామాన్యులు మండిపడుతున్నారు. కొండెక్కిన ఉల్లి ధరలకు కళ్లెం వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news