ప్రపంచ ఆహార దినోత్సవం: ఆహారం.. ఆరోగ్యం అందుకే అవన్నీ మానేయండి…

-

కరోనా కాలంలో బ్రతుకుతున్న మనకి ఆహారం గురించి ఆవశ్యకత చాలా వరకు తెలిసొచ్చింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో ఆహారం పాత్ర ఏంటన్నది అందరూ గుర్తిస్తున్నారు. కరోనా లాంటి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మంచి ఆహారం అవసరం అని అందరూ గుర్తించారు. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఐతే నేడు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆహారం గురించి తెలుసుకుందాం.

1980 నుండి ప్రతీ అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆహారం విలువ తెలియజెప్పడంతో పాటు ప్రతీ ఒక్కరికీ సరైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం జరుపుకుంటున్న ఆహార దినోత్సవానికి మన చర్యలే మన భవిష్యత్తు అనే నినాదాన్ని జత చేసారు. కరోనా నుండి బయటపడి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి మనం తీసుకునే ఆహారమే మేలు చేస్తుందన్న కారణంగా ఈ నినాదాన్ని పెట్టారు.

అహారమే ఆరోగ్యం.. ఆరోగ్యం మహాభాగ్యం.. సరైన ఆహారం దొరకకపోతే సరిగ్గా ఆలోచించలేరు. సరిగ్గా నిద్రపోలేరు. సరిగ్గా పనులు చేయలేరు. ఈ విషయాన్ని వర్జీనియా వూల్ఫ్ చెప్పారు. నిజమే కడుపులో ఆకలి చంపేస్తుంటే ఆలోచన కరెక్ట్ గా సాగదు. టీవీ యాడ్ లో చూపిస్తున్నట్టుగా బాగా ఆకలి వేసినపుడు ఆ మనిషి మారిపోతాడు. అందుకే సరైన సమయంలో సరైన పాళ్లలో సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రపంచంలో పోషకాహారం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు మాత్రం ఆహారాన్ని వృధా చేస్తుంటారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మొదలైన వాటి దగ్గర ఎంత ఆహారం వృధా పోతుందో అందరికీ తెలుసు. చాలామంది వారికి కావాల్సిన మాత్రమే వడ్డించుకోకుండా అన్నీ పెట్టుకుని వాటిని తినలేక వేస్ట్ గా పడేస్తుంటారు. ఇలా పడవేసే వాళ్ళు ఒక్కసారి పోషకాహారం అందక ఎంతమంది చిన్నారులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో తెలుసుకోవాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అలాంటి దాన్ని ఎందుకు పడేస్తారు. మరో విషయం ఏమిటంటే, ప్రతీ ఏటా రైతులు తగ్గిపోతున్నారు. చదువుకున్నవారు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరికొద్ది రోజుల్లో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే మనకి కావాల్సినంత మాత్రమే తిని, మిగతా దాన్ని కావాల్సిన వారికి చేరుద్దాం. మన భవిష్యత్ తరాలని కాపాడుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news