బిగ్ బాస్ సీజన్ 3 : ప‌డుకుంటేనే ఛాన్స్‌.. ఆ ఇద్ద‌రిపై రోహిణి సంచ‌ల‌న కామెంట్స్‌..!

2995

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని చాలా మంది తారలు కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. రెండేళ్లుగా ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా అన్ని ఇండ‌స్ట్రీల‌ను ఓ ఊపు ఊపుతోంది. చాలా మంది స్టార్ హీరోయిన్లు సైతం ధైర్యంగా త‌ము ఎవ‌రెవ‌రి నుంచి వేధింపులు ఎదుర్కొన్నామో చెప్పారు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ సంస్కృతి వెండితెర‌కే కాదు.. బుల్లితెర‌మీద కూడా ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే చాలా మంది బుల్లితెర ఆర్టిస్టులు చెప్పారు.

Bigg Boss 3 Rohini Reddy Shocking Comments
Bigg Boss 3 Rohini Reddy Shocking Comments

తెలుగు సీరియ‌ల్స్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతోంది బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్ రోహిణి. బిగ్ బాస్ హౌస్ నుండి గతవారం ఎలిమినేట్ అయిన రోహిణి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె చేస్తోన్న కొన్ని వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చాన‌ని అప్పుడు ఇండ‌స్ట్రీకి షిఫ్ట్ అయిన‌ట్టు చెప్పింది.

ఓ సీరియ‌ల్ అడిష‌న్ కోసం నిర్మాత‌ల‌ను క‌లిసిన‌ప్పుడు ఏకంగా తనను ఇద్దరు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పింది. మరో ఆడిషన్ లో కూడా ఇదే అనుభవం ఎదురైందని.. వయసులో చాలా పెద్ద వ్యక్తి తనను ఇబ్బంది పెట్టాడని.. అవకాశం ఇస్తా.. నాకేం ఇస్తావ్ అంటూ డైరెక్ట్ గా అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చింది. ఎన్నో ఇబ్బందులు, అవ‌మానాలు ఎదుర్కొని ఇప్పుడు న‌లుగురు మెచ్చుకునే స్థాయికి వ‌చ్చాన‌ని చెప్పింది. ఏదేమైనా రోహిణి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలుగు సీరియ‌ల్స్ రంగంలోనూ ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.