బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 3 కంటెస్టెంట్ల ఫైన‌ల్ జాబితా ఇదే..?

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 3లో పాల్గొన‌నున్న కంటెస్టెంట్ల వివ‌రాలు బ‌య‌టకు పొక్క‌కుండా స్టార్ మా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. కానీ.. తాజాగా ఒక లిస్ట్ మాత్రం ఇవాళ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌ను గ‌త రెండు సీజ‌న్ల‌లో ఎంతో అల‌రించిన బిగ్ బాస్ 3వ సీజ‌న్ ఎట్ట‌కేల‌కు రేప‌టి నుంచి ప్రారంభం కానుంది. జూలై 21వ తేదీ నుంచి ఈ షో ప్రారంభ‌మ‌వుతుంద‌ని గ‌తంలోనే స్టార్ మా ప్ర‌క‌టించింది. దీంతో అనుకున్న తేదీకే షోను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ షోకు గాను ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక ప్ర‌క్రియ పూర్తి కాగా వారు ఎవ‌రు..? అనే విష‌యం మాత్రం ఇంకా తెలియ‌లేదు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 3లో పాల్గొన‌నున్న కంటెస్టెంట్ల వివ‌రాలు బ‌య‌టకు పొక్క‌కుండా స్టార్ మా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. కానీ.. తాజాగా ఒక లిస్ట్ మాత్రం ఇవాళ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి అందులో ఏయే సెల‌బ్రిటీల పేర్లు ఉన్నాయంటే..

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2లో కంటెస్టెంట్‌గా ఉన్న నూత‌న్ నాయుడు ఇటీవ‌లే ఎన్ఎన్ చాన‌ల్ పేరిట యూ ట్యూబ్‌లో ఓ చాన‌ల్‌ను ఏర్పాటు చేశాడు. ఈ క్ర‌మంలోనే ఆ చానల్‌లో ఉంచిన ఓ వీడియోలో నూత‌న్ నాయుడు బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 3 పాల్గొన‌బోయే సెల‌బ్రిటీల లిస్ట్ ఇదే అంటూ 15 మందితో కూడిన ఓ జాబితాను అనౌన్స్ చేశాడు. ఆ లిస్ట్ ప్ర‌కారం.. ఈ సారి షోలో ఎవరెవ‌రు పాల్గొన‌నున్నారంటే…

1. నటి హేమ
2. యాంకర్ శ్రీముఖి
3. తీన్మార్ సావిత్రి
4. నటి హిమజా రెడ్డి
5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట)
7. సీరియల్ యాక్టర్ రవికృష్ణ
8. టీవీ యాక్టర్ అలీ రెజా
9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్
10. న‌టి పునర్వీ భూపాలం
11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
12. సింగర్ రాహుల్
13. యూట్యూబ్ స్టార్ మహేష్
14. టీవీ నటి రోహిణి
15. డబ్‌స్మాష్ స్టార్ అషూ రెడ్డి

అయితే ఈ 15 మంది జాబితా నూత‌న్ నాయుడుకు ఎలా ల‌భించిందో, అస‌లు ఈ జాబితా నిజ‌మో కాదో కూడా తెలియ‌దు. కానీ ప్ర‌స్తుతం ఇదే లిస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే దీనిపై నూత‌న్ నాయుడును ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు లిస్ట్ ఎలా వ‌చ్చింద‌నే విష‌యం.. అంతా సీక్రెట్ అని చెప్పాడు. కాగా రేపు బిగ్‌బాస్ షోలో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆ షో హౌస్‌లో అడుగు పెట్ట‌బోయే సెల‌బ్రిటీలు ఎవ‌ర‌న్న‌ది మ‌నకు రేపే పూర్తిగా తెలుస్తుంది. ఇక ఈ సారి షోలో 14 మంది సెల‌బ్రిటీలు 100 రోజుల పాటు పాల్గొన‌నున్నారు. మ‌రి ఈ సీజ‌న్ విన్నర్ ఎవ‌రు అవుతారో చూడాలి..!