2024 బడ్జెట్ : NPS లో 75 ఏళ్లు పైబడిన వారికి శుభవార్త..?

-

ఫిబ్రవరి 01న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లకు నేషన్ పెన్షన్ సిస్టమ్ లో పన్ను ప్రయోజనాలను అందించాలని చూస్తున్నారు. NPS లో డబ్బులు జమ చేయడం, ఉపసంహరించడం పై పన్ను మినహాయింపులను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పింఛన్ వ్యవస్థ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగుల తరుపున జాతీయ ఫించన్ వ్యవస్థకు తమ వాటాగా చెల్లించే మొత్తంలో 10 శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అదే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ లో అయితే 12 శాతం పై పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో చాలా కాలంగా ఈపీఎఫ్ఓ తో పాటు ఎన్పీఎస్ కి కూడా సమానంగా పన్ను ప్రయోజనాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో ఈ బడ్జెట్ లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news