శ్రీదాముని శాపం – రాధాకృష్ణుల ప్రేమ విఫలం

-

కృష్ణుడు, శ్రీదాముడు మంచి మిత్రలు. ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరు స్నేహానికి మారుపేరులా ఉంటారు. అయితే..

రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎలాంటి కల్మషం లేని ప్రేమ రాధది. ఒకరంటే ఒకరికి ప్రాణం.  ప్రేమకు చిహ్నమైన వీరి ప్రేమ, పెండ్లి పీటల వరకు ఎందుకు వెళ్లలేదు? కృష్ణుడు, రాధని నిరాకరించాడా లేదా రాధనే, కృష్ణుడిని వద్దనుకున్నదా? ఇలా చాలా సందేహాలు. వీటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం.

శ్రీకృషుడు, విష్ణువు ఎనిమిదో అవతారంగా ఉండగా.. రాధా, లక్ష్మీ దేవత అవతారంగా చెప్పబడుతున్నది. కృష్ణుడికి చాలామంది భార్యలున్నా అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే కలవరిస్తుంది. ఆపదలో ఉన్న మహిళలకు రక్షించడం కోసం చాలామందిని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. రాధా, కృష్ణ అనే పదాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ పేర్లు అసంపూర్ణంగానే ఉంటాయి. వీరి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా వీరిద్దరు పెండ్లి చేసుకోకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. వీరి పెండ్లి జరుగక పోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని కారణాలు.

కృష్ణుడిని కోపగించుకున్న రాధ.. శ్రీదాముని శాపం

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు, రాధ వారి పూర్వ జీవితంలో గోలక్‌లో నివసించేవారు. ఒకరోజు కృష్ణుడు భార్య అయిన వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు. వీరిద్దరిని పక్కపక్కనే చూసిన రాధకు కృష్ణుడిపై కోపం వచ్చింది. ఆయనతో గొడవపడింది. ఈ గొడవ వీర్జకు నచ్చలేదు. ఆ కోపంతో వీర్జ ఒక నదిగా మారి ఎప్పటికి కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. దీంతో కృష్ణుడు నిరాశ చెందాడు. రాధ కూడా కృష్ణుడితో మాట్లాడకుండా దూరంగా ఉన్నది. వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు కరుగలేదు.

కృష్ణుడు, శ్రీదాముడు మంచి మిత్రలు. ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరు స్నేహానికి మారుపేరులా ఉంటారు. అయితే.. రాధ, కృష్ణుడుపై గొడవ పడ్డ విషయం దామునికి తెలిసింది. దాముడు రాధకు నచ్చచెప్పాలని చూశాడు. అయినా రాధ ఏ మాత్రం చలించలేదు. పైగా కృష్ణుడిని తిట్టుడంతోపాటు, దామునిని కూడా తిట్టసాగింది. ఇది దామునికి మరింత కోపాన్ని తెచ్చింది. కోపానికి గురైన దాముడు మరుసటి జన్మలో కూడా ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేదు అని రాధను శపించాడు.

వీరి ప్రేమ అమరం

రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు. అంతేకాక రాధ కృష్ణుడికి ఆత్మబంధువుగా ఉండేది. కృష్ణుడు, విష్ణువు అవతారం. అందరి దేవతల వెనుక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు. అటువంటి సందర్భంలో తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలడు? భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు. జీవితంలో అన్నింటినీ పొందిగలిగిన కృష్ణుడు, ఏదైనా కోల్పోయాడు అంటే అది రాధ ప్రేమనే. వీరి ప్రేమ మీరా భాయి నుంచి కబీర్ దాస్ వరకు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈ విశ్వమే అంతమైనా వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news