కొమురవెల్లి మల్లన్న సేవలో మంత్రి పొన్నం.. ప్రతిపక్షాల మాటలకు స్ట్రాంగ్ కౌంటర్..!

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు ప్రారంభమయ్యాయని.. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్ నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తాజాగా కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్న అనంతరం దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రకృతి సహకరించి మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మల్లన్నను వేడుకున్నానని తెలిపారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో తాగునీటిని ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని.. సమస్య పరిష్కారం కాకపోతే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. పెట్టుబడులు తీసుకొస్తున్నామని RRR తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. 

Read more RELATED
Recommended to you

Latest news