విద్యా బుద్దులు నేర్పి.. సమాజంలో మనం సన్మార్గంలో నడవడంతో వారి పాత్ర కీలకం. నేడు మనం ఎలా వున్నా సరే మన ఉపాధ్యాయుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. మన భవిష్యత్తుకి బంగారు బాట వేసి ఎంతగానో తపన పడి…. చదువుతో పాటుగా ఎన్నో నేర్పుతూ… మన ట్యాలెంట్ ని కూడా బయటకి తీసుకు వస్తారు ఉపాధ్యాయులు. ఈ క్రమంలోనే భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం.
నిజంగా ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ తెచ్చిన గుర్తింపుకి మరియు గౌరవానికి ప్రతీ ఏడాది ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయుల్ని గౌరవించి… వాళ్ళు చేసిన వాటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుంది అని చాటిన ఆచార్యుడు.
ఉపాధ్యాయులు ఇచ్చిన జ్ఞానాన్ని మనం కొలవలేము… చూపిన ప్రేమకి, వేసిన బాటకి కృతజ్ఞతలు చాలవు. మంచి-చెడు, నిజాయతి ఇలా మనకి ఎంతో మంచిని నేర్పి అందమైన శిల్పంలా వారు తయారు చేస్తారు. నిజంగా ఒక గురువు తన విద్యార్థిని శిల్పి తన ఉలితో రాయిని చెక్కినట్టు అందంగా మారుస్తాడు అనడం లో సందేహం లేదు.