భార‌త‌ర‌త్న ప్ర‌త్యేక‌త.. అవార్డు పొందినవారికి ఇచ్చే సదుపాయాలు..

-

మాన‌వ‌జాతికి పాటుప‌డే ఏ రంగానికి చెందిన వ్య‌క్తికైనా.. భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే నిబంధ‌న‌ను కూడా త‌రువాతి కాలంలో చేర్చారు. ఇక ఈ అవార్డు కోసం ప్ర‌ధాని ఏడాదికి గ‌రిష్టంగా ముగ్గురిని రాష్ట్ర‌ప‌తికి సిఫార‌సు చేస్తారు.

దేశంలో ఎవ‌రైనా స‌రే.. ఆయా రంగాల్లో విశేష కృషి చేస్తే వారి జాతి, వ‌ర్ణం, వ‌ర్గం, మ‌తం, లింగ భేదం లేకుండా ఎవ‌రికైనా స‌రే.. భార‌త‌ర‌త్న అవార్డును ప్ర‌దానం చేస్తారు. దేశ రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ పుర‌స్కారాన్ని అందిస్తారు. అయితే భార‌త‌రత్న అవార్డును పొందిన వారు ఎవ‌రూ త‌మ పేరు ముందు, వెనుక భార‌త‌ర‌త్న అని చేర్చుకోకూడ‌దు. ఇక 1954 నాటి నిబంధ‌న‌ల ప్ర‌కారం కేవ‌లం బ‌తికి ఉన్న వారికే భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ఉండేది. కానీ దాన్ని 1955లో మార్చారు. దీంతో చ‌నిపోయిన వారికి కూడా భార‌త‌ర‌త్న‌ను ఇస్తూ వ‌స్తున్నారు.

కాగా మాన‌వ‌జాతికి పాటుప‌డే ఏ రంగానికి చెందిన వ్య‌క్తికైనా.. భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే నిబంధ‌న‌ను కూడా త‌రువాతి కాలంలో చేర్చారు. ఇక ఈ అవార్డు కోసం ప్ర‌ధాని ఏడాదికి గ‌రిష్టంగా ముగ్గురిని రాష్ట్ర‌ప‌తికి సిఫార‌సు చేస్తారు. వారిలో రాష్ట్ర‌ప‌తి ఎవ‌రికైనా భార‌త‌ర‌త్న‌ను ఇవ్వ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో భార‌త‌ర‌త్న పుర‌స్కారం పొందిన వారికి రాష్ట్ర‌ప‌తి త‌న సంత‌కంతో కూడిన ఒక ప‌ట్టాను, ఒక ప‌త‌కాన్ని ప్ర‌దానం చేస్తారు. ఈ పుర‌స్కారం కింద ఎలాంటి న‌గ‌దునూ ఇవ్వ‌రు.

భార‌త‌ర‌త్న పొందిన వారికి 7వ స్థాయి గౌర‌వం ఇస్తారు. అంటే మొద‌ట రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్లు, మాజీ రాష్ట్ర‌ప‌తులు, ఉప ప్ర‌ధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు ఉంటారు. ఆ త‌రువాత భార‌త‌ర‌త్న పొందిన వారికి గౌర‌వం ఇస్తార‌న్న‌మాట‌. ఇక ఈ గౌర‌వం వ‌ల్ల ఎలాంటి అధికారాలు రావు. అయితే భార‌తర‌త్న పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేయ‌డానికి ముందు గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చి విష‌యాన్ని తెలియ‌జేస్తారు. ఆ త‌రువాతే పుర‌స్కారాల ప్ర‌దానం ఉంటుంది.

కాగా 1954 నిబంధ‌న‌ల ప్ర‌కారం భార‌త‌ర‌త్న కింద ఇచ్చే ప‌త‌కం 1 3⁄8 ఇంచుల (35మిల్లీ మీటర్ల) వ్యాసార్థం క‌లిగిన వృత్తాకారంలో ఉన్న బంగారు ప‌త‌కంగా ఉండేది. ఈ ప‌త‌కం ముఖ‌భాగంలో సూర్యుని బొమ్మ ఉంటుంది. కింది భాగంలో వెండితో భార‌త‌ర‌త్న అని దేవ‌నాగ‌రి లిపిలో రాసి ఉంటుంది. వెనుక వైపు మ‌ధ్య భాగంలో ప్లాటినం లోహంలో భార‌త చిహ్నం, కింది భాగంలో వెండితో భార‌త జాతీయ నినాదం స‌త్య‌మేవ జ‌య‌తే అని రాసి ఉంటుంది.

అయితే ఆ ప‌త‌కం రూపాన్ని త‌రువాత మార్చారు. దీంతో ఇప్ప‌టికీ ఆ మార్చిన రూపాన్నే వాడుతున్నారు. అందులో ప‌తకం రావి ఆకును పోలి ఉంటుంది. అది 2 5⁄16 ఇంచులు (59 మి.మీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 మి.మీ.) వెడల్పు, 1⁄8 ఇంచుల (మి.మీ.) మందం కలిగి ఉంటుంది. దానిపై ప్లాటినం చట్రం ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 మి.మీ.) వ్యాసార్ధం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 మి.మీ.) నుంచి 1⁄2 దాకా (13 మి.మీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే ఉంటాయి. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచుల‌ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు. కాగా భారత రత్న పతకాలను కోల్‌క‌తాలోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. ఇక భార‌త‌ర‌త్న ప‌త‌కం ఖ‌రీదు దాదాపుగా రూ.2,57,732 ఉంటుంద‌ని అంచ‌నా.

ఇక భార‌త‌ర‌త్న పొందిన వారికి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, ఉప రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల‌తో స‌మాన‌మైన గౌర‌వం ల‌భిస్తుంది. వారికి డిప్లొమాటిక్ పాస్‌పోర్టు ఇస్తారు. అలాగే ఎయిర్ ఇండియాలో జీవితాంతం ఉచితంగా ప్రయాణం చేయ‌వ‌చ్చు. అలాగే రైళ్లు, బస్సుల్లోనూ ఉచిత ప్ర‌యాణానికి వీలు క‌ల్పిస్తారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version