కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా త్వరలో.. కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తాజాగా ప్రకటన చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం అయ్యాయని ఈ సందర్భంగా విమర్శలు చేశారు. బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న. బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ రాబోతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక అటు.. ఈటల రాజేందర్ అలాగే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.