కొన్నిసార్లు సిగ్గు కారణంగా కొంతమంది జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలని సరిగ్గా పూర్తి చేయలేరు. ఇలాంటి చోట్ల మాత్రం సిగ్గుపడకూడదు. తర్వాత మీరే పశ్చాత్తాప పడాలని చాణక్య అన్నారు. ఆచార్య చాణక్య ఈ నాలుగు చోట్ల సిగ్గు పడకూడదని.. ఇక్కడ సిగ్గుపడితే ఇబ్బందులు ఎదుర్కోవాలి అని తర్వాత పశ్చాత్తాప పడాలని అన్నారు.
విద్యని పొందడం లైఫ్ లో చాలా అవసరం. ప్రతి వ్యక్తులు ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ మీకంటే తక్కువ అనుకుంటే చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. విద్య ఎక్కడ ఎలా అభ్యసించినా కూడా సిగ్గుపడకూడదు. తర్వాత మీరే అవకాశాలు లేక పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది.
ఆహారం విషయంలో కూడా సిగ్గు పడకూడదు. ఆహారం తినకుండా ఉంటె మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్లు. ఎందుకంటే ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తాను తక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు.
ఆకలిని చంపుకోకూడదు. సంపూర్ణంగా భోజనం చేయాలి.
చాలాసార్లు జీవితంలో సిగ్గుపడడం వలన చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేక పోతారు. తర్వాత సమయం దాటిపోతుంది. అప్పుడు కూడా పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది.
డబ్బు విషయంలో కూడా సిగ్గు పడకూడదు. డబ్బు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉపయోగపడే వస్తువు. కాబట్టి ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటే అడగడానికి మొహమాటం పడొద్దు.