కాంగ్రెస్ లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ లొల్లి.. సోనియా గాంధీ రాకపోవడానికి కారణం అదే..

-

సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది.. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు.. కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.. అంతా బాగానే ఉన్నా.. రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై మంత్రులు గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. విగ్రహా ఏర్పాటుకు సంబంధించి కొందరు పలు సూచనలు చేసినా.. సీఎం వాటిని లైట్ తీసుకున్నారట.. ఇంతకీ మంత్రుల అసంతృప్తికి కారణమేంటో చూద్దాం..

తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్ మంత్రులు అంతర్గతంగా వ్యతిరేకించారనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.. ఈలోపు ప్రభుత్వం మారడంతో.. ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.. ఇది రాజకీయంగా పార్టీకి డ్యామేజ్ అవుతుందని మంత్రులు చెప్పినా.. ఆయన వినలేదట..దీంతో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చాలా మంది మంత్రులే డుమ్మా కొట్టారు.. ప్రస్తుతం ఈ వ్యవహారమే గాంధీభవన్ లో హాట్ టాపిక్ గా మారింది..

తెలంగాణా సెంటిమెంట్ ను బీఆర్ఎస్ పార్టీ నెత్తిన పెట్టుకుని రాజకీయం చేస్తోంది.. ఈ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి, తెలంగాణవాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని.. మంత్రులు లోలోనా మధనపడ్డారట..అందుకే ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. గాంధీ విగ్రహాన్ని వేరే చోట ఏర్పాటు చేద్దామని మంత్రులు చెప్పినా.. రేవంత్ వినలేదని.. ఇది బీఆర్ఎస్ కు ప్రచారఅస్త్రంగా మారిందని.. కొందరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version