చాణిక్య నీతి: ఖచ్చితంగా మౌనంగా ఉండవలసిన సందర్భాలు ఇవే..!

-

చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. వాటిని జీవితంలో ఉపయోగించడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు గురించి చెప్పడం జరిగింది. వాటిలో రాజకీయాలు, నైతిక విలువలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటి ఎన్నో అంశాలకు పరిష్కారాలను కూడా సూచించడం జరిగింది. ఎలాంటి సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఇతరులతో ఎప్పుడు మాట్లాడాలి, ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి అనే విషయాలను చాణక్యుడు వివరించాడు.

చాలా శాతం మంది అవసరం లేకుండా ఎంతో ఎక్కువ మాట్లాడతారు. పైగా నాలుక అస్సలు అదుపులో ఉండదు. కానీ ఎటువంటి సందర్భంలో అయినా నాలుకను అదుపులో ఉంచుకోవాలి అని చాణక్యుడు సూచించాడు. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం గొప్ప విషయమని తెలియజేశాడు. అనవసరంగా మాట్లాడడం వల్ల ఎన్నో నష్టాలు ఎదురవుతాయి. ముఖ్యంగా గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కనుక, అవసరమైన సందర్భంలో మాత్రమే మాట్లాడాలి. చాలా మంది తమను తానే పొగుడుకుంటూ ఉంటారు. అటువంటి అలవాటు అసలు మంచిది కాదు అని చాణక్యుడు చెబుతున్నాడు.

ఎటువంటి పరిస్థితుల్లో అయినా పొగుడుకుంటూ మాట్లాడిన వారితో ఎక్కువ మాట్లాడితే ఇతరులను అవమానించినట్టు భావిస్తారు. కనుక, మౌనంగా ఉండడం మేలు. తక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారు, పూర్తి జ్ఞానం ఉన్నవారు మౌనంగా ఉంటారు. పైగా, అటువంటి వారు శ్రద్ధగా విని, ఇతరులను అర్థం చేసుకుంటారు, సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఎటువంటి సలహా అడగకుండా మధ్యలో కలుగజేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మౌనం పాటించడమే మేలు. కనుక, ఇటువంటి సందర్భాల్లో అనవసరంగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండడం మేలు అని చాణక్యుడు చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news