చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా మనుషుల జీవితాలు, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, వివాహం, డబ్బు వంటి అనేక అంశాల గురించి చాణిక్యుడు చెప్పడం జరిగింది. జీవితంలో వ్యక్తిత్వం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లను మరియు లక్షణాలను పాటించడం వలన ఎంతో మంచి జీవితాన్ని పొందవచ్చు. అయితే, చాణిక్యుడు మనుషులలో ఉండే కొన్ని లక్షణాలు గురించి కూడా వివరించారు. చాణక్యుడు ప్రకారం ఎవరిలో కూడా కోపం మరియు అహంకారం అస్సలు ఉండకూడదు. ఈ రెండు లక్షణాలు ఎప్పుడైతే మనుషుల్లో ఉంటాయో, వారి జీవితం నాశనం అవుతుంది.
అంతేకాకుండా అదే కొనసాగడం వలన భవిష్యత్తులో తనకు తానే శత్రువుగా మారతారని చాణిక్య నీతిలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ కోపం రావడం వలన తర్వాత బాధపడుతూ ఉంటారు. కోపం వలన ఆలోచనా శక్తి మరియు అవగాహన శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతి సందర్భంలో కోపం రావడం వలన మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో తొందరపడి సరైన నిర్ణయాలను తీసుకోవడం కూడా ఎంతో కష్టమవుతుంది. ఎక్కువ కోపం ఉన్నవారు వృత్తి జీవితంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కోపంతో పాటు అహంకారం కూడా ప్రమాదం. అహంకారం ఉన్నప్పుడు, ఇతరులను తక్కువగా చూస్తారు అలాగే దగ్గరి సంబంధాలను దూరం చేసుకుంటారు. ఎప్పుడైతే అహంకారంతో వ్యవహరిస్తారో, గర్వం పెరుగుతుంది. దీనివలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా సమాజంలో గౌరవం కూడా ఉండదు. అందువలన, ఎప్పుడూ ఇతరులతో మర్యాదగా వ్యవహరించాలి. కనుక కోపం మరియు అహంకారం వంటి లక్షణాలు ఎన్నో నష్టాలను తీసుకొస్తాయని చాణిక్యుడు చెప్పారు. సంతోషకరమైన జీవితం గడపాలంటే ఇటువంటి లక్షణాలను తప్పకుండా దూరం చేసుకోవాలి.