స్నేహం విషయంలో ఈ అపోహలు వద్దు.. బాధ ఏదైనా ఒక్కటే..!

-

ఎమోషన్స్‌, యట్రాక్షన్స్‌, హార్మోన్స్ ఆడే ఆటే ఈ ప్రేమ, బంధాలు, అనుభందాలు. లవ్‌ బ్రేకప్‌ అయితే ఏ మనసూ తట్టుకోలేదు. జీవితం అంతటితో అయిపోయింది అన్నట్లు అనిపిస్తుంది. అయితే స్నేహం కూడా అంతే. ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడే స్నేహం నుంచి ఫ్రెండ్షిప్ బ్రేకప్ వరకు స్నేహం విషయంలో అందరికీ ఉండే అపోహలేంటో చూడండి.

స్నేహబంధం చాలా విలువైంది. ఒక మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలుంటే ప్రతి విషయంలో ఓదార్పు, అండ దొరుకుతుంది. మనం చెప్పే ప్రతి విషయాన్ని మనం కోణం నుంచి ఆలోచించి పరిష్కరిస్తారు. అర్థం చేసుకుంటారు. కానీ స్నేహం విషయంలో చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. వాస్తవానికి, ఊహకి చాలా తేడా ఉంటుంది.

స్నేహం విషయంలో ఉండే కొన్ని అపోహలు ఇవే..

ఫ్రెండ్షిప్ బ్రేకప్, లవ్ బ్రేకప్ అంత కష్టం కాదు:

ఎలాంటి బాధ అయినా ఒక్కటే. ఏ బంధం దూరం అయినా బాధ ఒకేలా ఉంటుంది. ఒక మనిషికి మనస్పూర్తిగా దగ్గరైనపుడు వాళ్లు దూరమైన బాధ భరించడం చాలా కష్టం. స్నేహమైనా, ప్రేమ అయినా బాధ ఒక్కటే.

నిజమైన స్నేహితులు మనకు ఎప్పుడూ అండగా ఉంటారు:

వినడానికి ఎంత బాగున్నా, ఒకరి హద్దుల్ని, పరిమితుల్ని తెలుసుకోకపోతేనే ఇలాంటి ఆలోచనలుంటాయి. ఎవరు చేయగలిగినంత వాళ్లు చేస్తారు. ఎవ్వరి నుంచీ ఎక్కువగా ఆశించకూడదు. ఆశించడం, అది దొరకనప్పుడు బాధపడటం ఇదంతా టైమ్‌ వేస్ట్‌ పని. ఏ మనిషి కూడా ఎదుటి వారిని ఎక్కువగా ఏదీ ఆశించకూడదు అప్పుడే హర్ట్‌ అవకుండా హ్యాపీగా ఉండగలుగుతారు.

పోల్చుకోకూడదు:

అసూయ, పోల్చుకోవడం ఏ బంధంలో అయినా సాధారణమే. కానీ అలాంటివి ఏమైనా ఉంటే స్పష్టంగా తెలియజేయాలి. గొడవపడకూడదు.

ఎన్నేళ్లయినా స్నేహంలో మార్పుండదు:

సమయంతో పాటూ ఏ బంధంలో అయినా వివిధ మార్పులు కామన్‌గా వస్తాయి. స్నేహితులను కలవడానికి, మాట్లాడటానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి. పగలు, ప్రతీకారాలు అంటూ అక్కరకురానీ వాటి గురించి పట్టించుకుంటే పోతే చివరకూ ఏదీ మిగలదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version