తెలంగాణలో పెట్టుబడులు.. మంత్రి శ్రీధర్ బాబుతో రైన్లాండ్ స్టేట్ బృందం భేటీ..!

-

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రైన్లాండ్ కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం  మంత్రి డానియేలా ష్మీట్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయింది. ఈ సమావేశంలో చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూప్లెర్, హైదరాబాద్ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రసాయనాలు, ఫార్మా ఉత్పత్తి, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు. సులభతర వాణిజ్య విధానాలు, తక్షణ అనుమతుల జారీలో తెలంగాణా అగ్రగామిగా ఉందని ఈ సందర్భంగా డానియెల్ బృందానికి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను
నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని తెలిపారు. రెండు ప్రాంతాల మధ్య సారూప్యతలను గుర్తించడం ద్వారా, పరస్పర ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుందని శ్రీధర్ బాబు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version