ఆలోచనలతో కలగాపులగమైన మనస్సుని నిశ్శబ్దంగా మార్చాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

-

ప్రస్తుత పరిస్థితుల్లో ఉరుకులు పరుగులు ఎక్కువయ్యాయి. ప్రతీదీ పరుగే. పరుగెత్తితే తప్ప ఏదీ దొరకని పరిస్థితి ఏర్పడింది. నిజానికి అంతలా పరుగెత్తాల్సిన అవసరం ఉందా అంటే అనుమానమే. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఎక్కడో ఓ చోట ఆగాల్సిందే. నిజానికి పరుగెత్తితే జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతారు. గెలవాలన్న కోరికే పరుగులో కనిపిస్తుంది తప్ప, మరొకటి కాదు. అందుకే చాలా మంది జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు. ఆస్వాదించాలన్న మాటలు మాట్లాడితే కూడా ఇదంతా చేతగాని వాళ్ళే మాట్లాడుతారన్న అభిప్రాయంలో ఉండి, ఈ మాటల వల్ల పరుగు పందెంలో వెనకబడిపోతామేమోనని చకచకా పరుగు తీస్తారు.

పరుగులో ఆలోచనలు కలగాపులగం అవుతున్నాయి. వేల వేల ఆలోచన్లతో మెదడు కంగాళీగా మారుతుంది. ఒక దశలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మరి దీన్నుండి కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. అనేక ఆలోచనలతో ఆందోళనకరంగా మారుతున్న మీ మెదడుకి ప్రశాంతత అనే మందు కావాలి. ఆ మందు మీ చేతుల్లోనే ఉంది.

అవును, ప్రతి రోజు ఒక పది నిమిషాల పాటు మీ సమయం దానికి ఇస్తే చాలు. మీ మెదడు ప్రశాంతంగా మారి కొత్త ఆలోచనలని మరింత కొత్తగా చేయడానికి. ఆ పది నిమిషాలు ఏం చేయాలి? ఏం చేస్తే ఆ పది నిమిషాలు మీ మెదడుని కామ్ గా ఉంచుతుంది. ధ్యానం.. నిజమే.. ధ్యానం చేయడం వల్ల మీ మెదడులో ఆలోచనల ప్రవాహం తగ్గి, ఒక వరుస క్రమంలో పేర్చబడతాయి. ధ్యానం ఎలా చేయాలనేది చాలా మందికి కలిగే ప్రశ్న. ఏం లేదు. మీకెన్ని ఆలోచనలు కలుగుతున్నాయో వాటి మీద దృష్టి సారించండి. కొద్ది సేపయ్యాక ఆలోచనల్లో ఒక మార్పు వస్తుంది.

ఇలా రోజూ ఒక పది నిమిషాలు చేస్తూ, తర్వాత పెంచుకుంటూ వెళ్తుంటే మీ మెదడులో ఆలోచనల సరళి మారి కొత్తగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version