అమ్మాయిల మనసు సముద్రమంత లోతు ఉంటుందని ఊరికే చెప్పలేదు. వారి మనసు అర్థం చేసుకోవడం వారికి నచ్చేట్టు ఉండడానికి చాలా కష్టపడాలి. అద్భుతమైన వ్యక్తిత్వం ఆకర్షణమైన క్వాలిటీస్ ఉన్న వారి పట్ల ఆడవారి ఎక్కువగా ఆకర్షితులవుతారు. కేవలం డబ్బే కాదు అంతకుమించి కొన్ని లక్షణాలు పురుషులను ఆడవారి దృష్టిలో ప్రత్యేకంగా నిలబడతాయి. మరి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వారి రిలేషన్షిప్ లో కూడా ఎక్కువ కాలం సంతోషంగా ఉంటారు. మరి అమ్మాయిలు ఎక్కువగా ఇంప్రెస్ అవ్వాలంటే మగవారిలో ఉండాల్సిన క్వాలిటీస్ చూసేద్దాం..
నిజాయితీ నమ్మకం: ఒక రిలేషన్ షిప్ లో అత్యంత ముఖ్యమైన పునాది నిజాయితీ. మగవారు ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉంటే ఆడవారు వారిను సులభంగా నమ్ముతారు. తమ మాటకు కట్టుబడి ఉండేవారిని చిన్నచిన్న అబద్ధాలు కూడా చెప్పని వారిని ఆడవారు ఎక్కువగా ఇష్టపడతారు. నిజాయితీతో కూడిన నమ్మకం వారికి భద్రత భావాన్ని ఇస్తుందని ఆడవారు భావిస్తారు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు.
గౌరవం: ఒక స్త్రీని ఆమె అభిప్రాయాలను ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులను గౌరవించే వ్యక్తి పట్ల ఆడవాళ్లు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఆమెకి మాత్రమే గౌరవం ఇవ్వడం కాదు ఆమె కుటుంబానికి ఆమె ఇష్టపడుతున్న అభిప్రాయాలకు గౌరవం ఇస్తే అటువంటి వారిని ఆడవారు తొందరగా ఇష్టపడతారు. స్రి ని చిన్న చూపు చూడకుండా వారి ఆలోచనలకు విలువ ఇచ్చేవారు,వారితో సమానంగా చూసే క్వాలిటీ మగవారిలో ఉంటే అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తారు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్ : సరైన సమయంలో సరదాగా మాట్లాడి నవ్వించే గుణం ఉన్న వారిని ఆడవారు ఇష్టపడతారు. కష్టమైన పరిస్థితుల్లో హాస్యంతో వాటిని ఎదుర్కొనే వారి పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. అయితే ఇలా హాస్యం చేయడం ఇతరులను కించపరిచేలా ఉండకూడదు. అది ఆమెని మాత్రమే సరదాగా ఉంచడానికి మాత్రమే అన్నట్లుగా ఉండాలి. ఇలాంటి క్వాలిటీ ఉన్న వారి పట్ల అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ : తమ బాధలను కష్టాన్ని అర్థం చేసుకొని వాటి కి సపోర్టుగా నిలిచే మగవారిపట్ల ఆడవారు గౌరవం చూపిస్తారు. రిలేషన్ షిప్ లో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఇలాంటి క్వాలిటీ ఉన్న వారే కావాలని ఆడవారు భావిస్తారు. కోపానికి,నిరాశకు లోనవ్వకుండా ఉండడం అనేది ఈ క్వాలిటీ ప్రత్యేకత.
బాధ్యతాయుత ప్రవర్తన : తమ జీవితాన్ని ఆర్థిక వ్యవహారాలను కుటుంబ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించే వారిని ఆడవారు నమ్ముతారు. మగవారు అంటేనే బాధ్యతతో భవిష్యత్తుని సురక్షితంగా ఉంచగలిగే వారు అని భావిస్తారు. ఇక అంతేకాక అవసరమైనప్పుడు తోడుగా ఉండి సహాయం చేసి సంరక్షించే గుణం ఉన్న వారి పట్ల ఆడవారు ఆకర్షితులవుతారు. వారి కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలుపంచుకునే వ్యక్తిని వారు ఎప్పటికీ వదులుకోరు.
మరి ఈ లక్షణాలు ఉన్న పురుషులు తమ వ్యక్తిత్వంతోనే ఆడవారిని ఎక్కువగా ఇంప్రెస్ చేయగలుగుతారు డబ్బు, అందం కన్నా ఈ గుణాలు ఉన్న వారిని ఆడవారు కోరుకుంటారు.