చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. వీటిని పాటించడం వలన ఎంతో క్రమశిక్షణతో జీవించవచ్చు. ముఖ్యంగా పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో మంచి విషయాలను వివరించాడు. తల్లిదండ్రులు ఎలా అయితే ఇంట్లో ప్రవర్తిస్తారో వారిని చూసి పిల్లలు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా మాట్లాడుతున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి వంటివి పిల్లల జీవితం పై ప్రభావం చూపిస్తుంది. అందువలన తల్లిదండ్రులు సరైన తీరులో ఉండాలి.
పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారి ముందు ఇటువంటి పొరపాట్లను అస్సలు చేయకూడదు. పిల్లల ముందు తల్లిదండ్రులు కోపంగా మాట్లాడటం, భావోద్వేగాలను ప్రదర్శించడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వలన కోపంలో ఎన్నో విషయాలను బయటకు చెబుతారు దీని వలన వారి ప్రవర్తన పై నియంత్రణ ఉండదు. దీంతో పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. ప్రతి చిన్న విషయంలో అబద్దాలు చెప్పడం వంటివి చేయడం వలన పిల్లలు అదే అలవాటుగా మార్చుకుంటారు మరియు భవిష్యత్తులో దాన్ని మార్చుకోవడం ఎంతో కష్టమవుతుంది. కనుక తల్లిదండ్రులు ఎలాంటి సందర్భాలలో అబద్ధాలు చెప్పకూడదు.
చాలా శాతం మంది తల్లిదండ్రులు పిల్లల ముందు ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన పిల్లలు మర్యాదగా వ్యవహరించరు మరియు జీవితంలో గర్వం, అహంకారం వంటివి ఎక్కువ అవుతాయి. కనుక ఇటువంటి పొరపాట్లను అస్సలు చేయకండి. అందరి ఇంట్లో గొడవలు సహజంగా వస్తూ ఉంటాయి. అయితే అటువంటి సందర్భాలలో పిల్లలు ముందు భార్య భర్తలు ఒకరినొకరు అస్సలు అవమానించుకోకూడదు. ఇలా చేయడం వలన పిల్లల ప్రవర్తన మారుతుంది మరియు మనసు పై చెడు ప్రభావం కలుగుతుంది. దీంతో భవిష్యత్తులో తల్లిదండ్రులపై గౌరవం తగ్గుతుంది. కనుక పిల్లల ముందు మీ ప్రవర్తన ఎంతో అదుపులో ఉండాలి.