చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే జీవితంలో వాటిని ఉపయోగిస్తారో, ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. పైగా అటువంటి నియమాలను పాటించడం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్తారు. చాణక్యుడు ఎంతో గొప్ప పండితుడు మరియు ఆర్థికవేత్త. చాణక్యుడికి ఉండేటువంటి నైపుణ్యంతో ప్రజలకు మంచి మార్గాన్ని చూపించడానికి ఎంతో సహాయం చేశాడు అనే చెప్పవచ్చు. కనుక ప్రతి ఒక్కరు ఆ నియమాలను పాటిస్తే ఎంతో మంచి దారిలో నడుచుకుంటారు ఈ విధంగా విజయాన్ని పొందుతారు.
జీవితం, డబ్బు, చదువు, ఆర్థిక సమస్యలు, కష్టాలు, మహిళలు, బంధుత్వాలు వంటి ఎన్నో ముఖ్యమైన అంశాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా జీవితంలో త్వరగా ధనవంతులు ఎవరు అవుతారు అనే అంశం గురించి కూడా ఎంతో చెప్పడం జరిగింది. కనుక చాణక్యుడు ప్రకారం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు జీవితంలో త్వరగా ధనవంతులు అవుతారు. ఎవరైతే పెద్దవారికి గౌరవం ఇస్తారు మరియు మర్యాదగా వ్యవహరిస్తారో వారు జీవితంలో ఎంతో త్వరగా ధనవంతులు అవుతారు. అంతేకాకుండా చాణక్యుడు ప్రకారం, ఎవరైతే శత్రువులను కూడా మిత్రులుగా భావించి మాట్లాడతారో వారు జీవితంలో ఎంతో త్వరగా విజయాన్ని పొంది ధనవంతులుగా నిలుస్తారు.
దీంతో పాటు, జీవితంలో ఏ వ్యక్తి అయితే సమయపాలన పాటిస్తారో, వారు సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటారు. దీని వల్ల వారు ధనవంతులుగా నిలుస్తారు. సహజంగా విజయాన్ని పొందిన తర్వాత దానం చేయడానికి అందరూ ముందుకు రారు. అయితే ధనాన్ని పొందిన తర్వాత ఎవరైతే దానాన్ని కూడా చేస్తారో, వారి గుణం ఎంతో గొప్పది. కనుక అటువంటి వారి జీవితంలో దానానికి సంబంధించి ఎలాంటి లోటు ఉండదు. కనుక ఈ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు జీవితంలో ధనవంతులుగా నిలుస్తారు అని చాణిక్యుడు చెప్పడం జరిగింది.