పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పై భారత్ గర్జించింది : రాజ్ నాథ్ సింగ్

-

ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యే కాదని.. ఉగ్రవాదం పై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. భారత సైన్యం పరాక్రమాన్ని ప్రదర్శించిందని.. పాక్ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఆయన ఉగ్ర శక్తులకు భారత్ దీటుగా బదులిస్తుందన్నారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాదం పై పోరులో దృఢ సంకల్పంతో పాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పిందన్నారు. పహల్గామ్ బాధితులకు న్యాయం చేకూరిందన్నారు. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదని.. కానీ దాయాది మాత్రం పౌరులే లక్ష్యంగా మన దేశం పై దాడులు చేసిందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news