సహజంగా ఎలాంటి బంధంలో అయినా ఎదుటివారిని ఇష్టపడితేనే వారితో సమయాన్ని గడపడం లేక ఆలోచనలను పంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఆడవాళ్లు ఎప్పుడూ కూడా వారి ఇష్టాన్ని బయట పెట్టరు కాకపోతే ఒక అమ్మాయి ఇష్టపడుతున్నట్లయితే ఎంతో సులువుగా కనిపెట్టవచ్చు. అటువంటి లక్షణాలు తెలుసుకుంటే వారి ప్రేమను ఎంతో త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందో అప్పుడు ఎంతో బిజీగా ఉన్నా సరే సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక ప్రయత్నం అనే చెప్పవచ్చు.
అదేవిధంగా మాట్లాడుతున్నప్పుడు మీ భవిష్యత్తు గురించి, మీ లక్ష్యాల గురించి మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఈ విధంగా ఆలోచనలను పంచుకుంటూ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది మరియు కేవలం మాటలు మాత్రమే కాకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందో అప్పుడు తన భవిష్యత్తు గురించి కూడా చెబుతుంది. ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాలు, ఇష్టమైన పనులు వంటి వాటిని చెబుతుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడితే కనుక తనే మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా మాట్లాడుతూ ఎంతో ఆనందాన్ని పొందుతుంది.
కేవలం మీతో సమయాన్ని గడపడానికి తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడినప్పుడు సహజంగా కంటే ఎక్కువ సమయం మీ కళ్ళల్లోకి చూస్తుంది మరియు మీ గురించి ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయి మిమ్మల్నిఇష్టపడుతుందో తన దగ్గర ఇతర అమ్మాయిలు గురించి మాట్లాడితే తనకు అస్సలు నచ్చదు. అది కేవలం ప్రేమ మరియు రక్షణ వలెనే అని అర్థం చేసుకోవాలి. కనుక ఈ లక్షణాలు కనబడితే తప్పకుండా అది ప్రేమ వలనే అని అర్థం చేసుకోండి.