ఒంటరిగా ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..!

-

సహజంగా ప్రతి ఒక్కరు కుటుంబం, స్నేహితులు లేక భాగస్వామితో ప్రయాణాలను చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒంటరిగా ప్రయాణించడం కొత్త ట్రెండ్‌ గా మారింది. ఒంటరిగా ప్రయాణించడం వలన స్వేచ్ఛను పొందుతారు అని చాలా మంది భావిస్తున్నారు. పైగా ఇది ఒక సాహసంగా భావించి, ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరిగా ప్రయాణించడం ఉత్సాహకరంగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో ఆందోళన కలిగించవచ్చు. కనుక, భద్రతా చర్యలను పాటించడం అవసరం. ఒంటరిగా ప్రయాణం చేసే ముందు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటించడం వలన మరింత సురక్షితంగా ప్రయాణించవచ్చు.

మొదటిసారి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లయితే, ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాలను సందర్శించడం ఉత్తమం. అంతేకాకుండా, రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే జైపూర్, పాండిచ్చేరి వంటి ప్రదేశాలను ఎంపిక చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా మొదటిసారి ప్రయాణించాలంటే సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ వంటి భద్రమైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా, సరైన సీజన్లో సరైన ప్రదేశాన్ని సందర్శించడం చాలా అవసరం. కొన్ని ప్రదేశాల్లో వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.

కనుక, ఏ సీజన్లో ఏ ప్రదేశాలు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయో ముందుగా తెలుసుకుని వెళ్లడం ఉత్తమం. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు. కొత్తవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీ లొకేషన్‌ను పంపించడం ఎంతో అవసరం. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితమైన వసతిను ఎంపిక చేసుకోవాలి. మారుమూల ప్రాంతాలు లేదా ఏకాంత హోటళ్లను ఎంపిక చేసుకోవడం వల్ల ఆందోళన కలగవచ్చు. కనుక, ప్రయాణానికి అనుకూలమైన ప్రదేశాలను మాత్రమే ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ సూచనలు పాటించడం ద్వారా ఒంటరి ప్రయాణం మరింత ఆనందకరంగా మరియు సురక్షితంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news