గెలవాలి అంటే ఈ తప్పులు చెయ్యకండి…!

-

ఒక్కసారైనా ఫెయిల్ అయ్యానని గెలిచిన ప్రతి ఒక్కరు నిజాయితీగా ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం లో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఫెయిల్ అవకుండా విన్ అయిన వాళ్ళు ఎవరూ ఉండరు. గెలుపు, ఓటమి రెండు వస్తూనే ఉంటాయి. కేవలం గెలుపు మాత్రమే ప్రతిసారి వస్తుందని అనుకోవడం కల మాత్రమే. అయితే అసలు ఎందుకు ఫెయిల్ అవుతాను..?, ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి…?, ఎలా చేస్తే మనకు ఫెయిల్యూర్ రాదు…? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం మీకోసం. మరి ఇక ఆలస్యం ఎందుకు ఫెయిల్యూర్ గురించి, దానికి గల కారణాలు గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.

పట్టుదల తక్కువగా ఉండటం:

పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నయినా భరించ వచ్చు. ఎంతటి స్థానం అయినా పట్టుదలతో పొందొచ్చు. అదే మీకు పట్టుదల కనుక తగ్గింది అంటే తప్పక మీకు ఓటమి ఎదురవుతుంది. అలానే మీరు దేనికైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు గతం లో మీకు ఎదురైన ఇబ్బందులను తెలుసుకుని వాటిని సవాలుగా తీసుకుని మరింత తెలివి తో మీరు ముందుకు వెళ్లాలి.

మీపై మీకు నమ్మకం లేకపోవడం:

నేను చేయగలను, నేను సాధించగలను అని నమ్మకంగా ఉండాలి. మీపై మీకు పూర్తి నమ్మకం ఉండాలి. అదే నమ్మకం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మీరు ఎంతటి కష్టం లో ఉన్నా మీ పై నమ్మకాన్ని పెంచుకుంటూ పోవాలి కానీ మధ్యలో ఆగిపోకూడదు.

చేసిన తప్పులే తిరిగి చేయడం:

తప్పుల నుండి మనం నేర్చుకోవాలి కానీ ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకూడదు. మీరు చేసిన తప్పులు పై దృష్టి పెట్టి దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కనుక మీరు మరింత మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలు అవుతుంది. ఇలా మీరు చేసిన తప్పుల్ని తిరిగి మళ్లీ చేయకుండా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news