హనీమూన్‌కు గోవా వెళ్తున్నాం అని అయోధ్య తీసుకెళ్లిన భర్త.. విడాకులకు అప్లై చేసిన భార్య

-

ఈరోజుల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొందరు జీవిత భాగస్వామి ప్రవర్తన నచ్చక, వారితో లైఫ్‌ సెట్‌ కాదని ఈ నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరి సిల్లీ సిల్లీ రీజన్స్‌కే విడాకులు తీసుకుంటున్నారు. టమోటాల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు భర్త టమోటా కర్రీ చేశాడని ఓ మహిళ విడాకులకు అప్లై చేసింది.. ఇప్పుడు హనీమూన్‌కు గోవా తీసుకెళ్తానని భర్త అయోధ్యకు తీసుకెళ్లాడని భార్య విడాకులకు అప్లై చేసింది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.! మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి సంబంధించిన ఈ కథ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మీడియా నివేదికల ప్రకారం, ఈ జంట గత సంవత్సరం ఆగస్టులో వివాహం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఐటీ ఇంజనీర్, పెళ్లి తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడు. హనీమూన్‌కి విదేశాలకు తీసుకెళ్తానని అతని భార్య కోరింది. వృద్ధ తల్లిదండ్రులు ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటున్నారు..కాబట్టి వారు మతపరమైన ప్రదేశానికి వెళ్లాలని ఆ వ్యక్తి పట్టుబట్టాడు. అయితే చాలా చర్చల తర్వాత ఆమెను హనీమూన్‌కి తీసుకెళ్లేందుకు భర్త అంగీకరించాడు.కానీ ప్రయాణానికి ఒక రోజు ముందు ఆ వ్యక్తి తన ప్లాన్‌ను మార్చుకున్నాడు. పాపం ఆ మహిళ గోవా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తన తల్లి కోరిక మేరకు తాము అయోధ్య, వారణాసి వెళ్తున్నామని యాత్రకు ఒకరోజు ముందు తన భర్త చెప్పాడని మహిళ ఆరోపించింది. దీని తర్వాత దంపతులు తమ తల్లిదండ్రులతో కలిసి వారణాసి, అయోధ్యకు వెళ్లారు. అయితే తిరిగి వస్తుండగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళ తన భర్త నుంచి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది.

రిలేషన్ షిప్ కౌన్సెలర్ షైల్ అవస్తి ప్రకారం, భర్త తన నమ్మకాన్ని పొగొట్టాడుని భార్య ఆరోపించింది. వారి వివాహం ప్రారంభం నుంచి, అతను తన కుటుంబానికి తన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని తెలిపింది. అయితే వారిద్దరి మధ్య రాజీ కుదిరేలా కుటుంబ న్యాయస్థానంలో కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ విషయంలో భార్యది ఎంత తప్పు ఉందో.. భర్తది కూడా అంతే ఉంది. చాలా మందికి ఇది సిల్లీ రీజన్‌ అనిపించవచ్చు కానీ.. ఆ ప్లేస్‌లో ఉన్న మహిళకు పాపం అది చాలా బాధ కలిగించే విషయం.. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా నమ్మకం చాలా ముఖ్యం.. ఇలా చివరి నిమిషంలో చెప్పడం భర్త చేసిన తప్పే. ఆమెకు అయోధ్య వెళ్లడం ఇష్టం లేదంటే.. వదిలేయాలి..ఇలా మోసం చేసి తీసుకెళ్లకూడదని కొందరు నెటిజన్లు అంటున్నారు. మీరేంమంటారు.. ఇందులో తప్పు ఎవరిదంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news