IND VS ENG : ఉప్పల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే

-

ఇంగ్లాండ్ జట్టుతో తొలి టెస్ట్ లో టీమిండియా ఊహించని పరాభవాన్ని చవిచూసింది. అయితే భారత్ ఓడిపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 196 పరుగుల తో రాణించిన ఓలి పోప్ రెండుసార్లు క్యాచులు ఇచ్చిన మనవాళ్లు జారవిడిచారు.

రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మరియు జడేజా భారీ గా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. అటు టీమిండియా బ్యాటర్లలో జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ మరియు గిల్ ఘోర ప్రదర్శన కారణంగా టీమిండియా ఓటమిపాలైంది.

కాగా, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ నిర్దేశించిన 231 టార్గెట్ ను ఛేదించలేకపోయింది. 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్ హార్ట్ లీ 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ (39), భరత్, అశ్విన్ మినహా టీమిండియా బ్యాటర్లు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయారు. చివరలో బుమ్రా, సిరాజ్ విజయం సాధిస్తారనుకునే లోపే హార్ట్ లీ బౌలింగ్ లో సిరాజ్ ముందుకు రావడంతో స్టంప్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news