భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసులు కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గడచిన 24 గంటలలో నమోదయిన కేసులు ఇప్పటి దాకా నమోదు కాలేదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 లక్షల 96 వేలు దాటింది. అలా మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,645 కేసులు నమోదయ్యాయి. ఇక గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 942 మంది మృతి చెందారు.
దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 47,033కు చేరింది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,383 కాగా ఈ ఇప్పటి దాకా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 16,95,982కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,53,622 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా కరోనా నుండి కోలుకున్న వారితో దేశంలో కరోనా రికవరీ రేటు 70.38 శాతానికి చేరింది. ఇక దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 27.64 శాతంగా ఉంది. అలానే దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.98 శాతానికి తగ్గింది.