పది లక్షల మార్క్ దాటిన కరోనా మరణాలు

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఏం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 3.33 కోట్లకు చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి దాకా కరొనాతో మృతి చెందిన వారి సంఖ్య 10.2 లక్షలకు చేరింది.

 

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనా వచ్చి కోలుకున్నవారి సంఖ్య 2.46 కోట్లకు చేరింది. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ విజృంభణ భారీగా ఉన్నా, ప్రపంచ దేశాల్లో కాస్త ఇప్పుడు నెమ్మదించింది అనే చెప్పాలి. వైరస్ బలం కూడా తగ్గిందనే వాదన కూడా వినిపిస్తోంది. భారత్ లో కూడా రోజూ లక్ష దాకా నమోదయ్యే కేసులు కొద్ది రోజులు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ఎనభై వేలకి దగ్గరలో నమోదవుతున్నాయి. ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా లాక్ డౌన్ ఎత్తివేశారు. దీంతో కాస్త గట్టిగానే కేసులు నమోదవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news