ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ ని ఎదుర్కోటానికి చాలా మంది భయపడుతున్నారు. ప్రభుత్వాలు మరియు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మందులేని ఈ వైరస్ నీ ఎదుర్కోనాలంటే నియంత్రణ ఒకటే మార్గం కావటంతో దేశ ప్రధానులు అంతా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బలి తీసుకున్న ఈ వైరస్ నీ 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు జయించాడు.
ఇంతకీ ఆయన చనిపోయింది గుండెపోటుతో. వయసు మీద పడటంతో అనేక ఆరోగ్య సమస్యలు ఉండటంతో… నిద్రపోతూ వేకువజామున గుండెపోటుతో మరణించడం జరిగింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నా చావు మాత్రం ఆగలేదు. ఈ వార్త కేరళలో సంచలనంగా మారింది.