కోవిడ్ వ్యాక్సిన్: వేయించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

-

కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, 18ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది. మే 1వ తేదీ నుండి 18ఏళ్ళు నిండిన వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. విజృంభిస్తున్న కరోనా నుమ్డి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ని మించిన ఆయుధం లేదని, అందువల్ల అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని, దానికోసం కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునే ముందు, వేయించుకున్న తర్వాత తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటో ఇక్కడ చూద్దాం.

నిద్ర

వ్యాక్సిన్ వేయించుకునే ముందు కనీసం ఆరు గంటల పాటైనా నిద్రపోవాలి. పూర్తిగా అలసిపోయి, నిద్రలేకుండా ఉంటే మాత్రం వ్యాక్సిన వేయించుకోవద్దు. అలసట లేకుండా, శరీరానికి మంచి విశ్రాంతి దొరికాకే వ్యాక్సిన్ వేయించుకోండి.

శ్వాస

ఒత్తిళ్ళని దూరం పెట్టండి. ఒత్తిడి ఎక్కువైతే అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే కామ్ గా ప్రశాంతంగా ఉండండి. శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి.

పొగతాగవద్దు

శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలంటే పొగ తాగకూడదు. వ్యాక్సిన్ వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ సరిగ్గా పనిచేయాలంటే పొగ తాగకుండా ఉండడం మంచిది.

మద్యపానం మంచిది కాదు

వ్యాక్సిన్ తీసుకునే మూడురోజుల ముందు మద్యం ముట్టరాదు. ఆల్కహాల్ కారణంగా వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మూడు రోజుల వరకు ఆల్కహాల్ సేవనాన్ని ఆపేయాలి.

జింక్ తీసుకోవాలి

యాంటీ బాడీల పనితీరు మెరుగుపర్చడానికి జింక్ చాలా సాయపడుతుంది. శరీరంలో జింక్ శాతం తగ్గితే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి. అందుకే వ్యాక్సిన్ కి వెళ్ళేముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.

ప్రోటీన్ ని తీసుకోండి.

మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version