రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. కరోనా బారిన పడిన బాధితులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించక పోవడం, కొందరి బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడం వల్లే వారి ప్రాణాలను తీసుకుంటుంది. కర్నూన్ జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతోంది. పిగిడ్యాల చెందిన ఐజయ్య (55) ఈఓఆర్డీగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఉద్యోగ రీత్యా బయట ప్రాంతాలకు తిరగాలి. దీంతో అతడికి గత కొద్ది రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడంతో ఐజయ్య సమీప ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. బ్లడ్ రిపోర్టులు రావడంతో అతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఐలయ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. వైరస్ తీవ్రత అధికమవడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఐలయ్య మరణించిన వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.