చాలా మంది ప్రతిరోజూ పాలని తీసుకుంటూ ఉంటారు అయితే పాలని తీసుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. పాలతో పాటుగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం అసలు మంచిది కాదు. దాని వలన పలు సమస్యలు కలుగుతాయి. మరి పాలతో పాటుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఎటువంటివి తీసుకుంటే సమస్యలు వస్తాయి అనేది చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం పాలు పెరుగు కలిపి తీసుకోకూడదట.
ఈ రెండిటినీ కలిపి తీసుకున్నట్లయితే ఉదర సంబంధిత సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఈ పొరపాటున అసలు చేయకండి. అలానే సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా పాలతో పాటుగా తీసుకోకండి పాలతో పాటుగా వీటిని తీసుకోవడం వలన వాంతులు కడుపులో నొప్పి వంటివి కలుగుతాయి. పాలల్లో చక్కెర వేసుకుని తీసుకోకుండా చాలా మంది బెల్లం వేసుకుంటారు కానీ అలా చేయడం వలన కడుపునొప్పి వస్తుంది.
పాలుతో పటుగా మసాలా ఫుడ్ ని తీసుకుంటే అజీర్తి సమస్యలు కలిగే అవకాశం ఉంది పాలతో పాటుగా చేపలని తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పొరపాటు కూడా ఇలా చేయకండి పాలతో పాటు గుడ్డు మాంసం కూడా తీసుకోవద్దు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. పాలతో పాటుగా చిప్స్ వంటివి కూడా తీసుకోవద్దు. ఇలా ఈ ఆహార పదార్థాలను పాలతో తీసుకున్నట్లయితే సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా ఉదర సంబంధిత సమస్యలు అజీర్తి సమస్యలు అలానే వాంతులు వంటివి కలుగుతాయి.