కోవిడ్‌ టెస్ట్‌, టీకాల సమయంలో ఇచ్చిన 81.5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యిందా?

-

కోవిడ్ పరీక్షకు సంబంధించి సేకరించిన దేశంలోని 81.5 కోట్ల మంది పౌరుల డేటాను దొంగిలించారని, దానిని అమ్మకానికి ఉంచారని ఓ వ్యక్తి ICMR వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఇది దేశంలోనే అతిపెద్ద డేటా చోరీగా పేర్కొంటున్నారు. పరీక్ష సమయంలో వ్యక్తులు ఇచ్చిన ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నంబర్, చిరునామా తదితర సమాచారం లీక్ అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఐసీఎంఆర్ ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. ఫిర్యాదు అందితే సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉందని సమాచారం.

‘ఫెట్ యాక్టర్ అలియాస్ పిడబ్ల్యుఎన్ 0001’ అనే వినియోగదారు అధార్ సమాచారంతో సహా చాలా మంది సమాచారాన్ని పంచుకున్నారు మరియు 81.5 కోట్ల మంది వ్యక్తుల డేటా అమ్మకానికి ఉందని చెప్పారు. కోవిడ్ సమయంలో, చికిత్స, టీకా మొదలైన అనేక కారణాల వల్ల ప్రజలు తమ వ్యక్తిగత రికార్డులను ICMRలో నమోదు చేసుకున్నారు.

ఇప్పుడు ఆ డేటా అంతా చోరీకి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ పరీక్షకు సంబంధించి సేకరించిన దేశంలోని 81.5 కోట్ల మంది పౌరుల డేటా దొంగిలించబడి, అమ్మకానికి ఉంచుతున్నట్లు ఒక వ్యక్తి ICMR వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ఒకవేళ ఇదే గనక నిజం అయితే.. దేశం పౌరుల డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడినట్లే.. ఆధార్‌ డేటాతో ఏం జరుగుతుందిలే అనుకుంటారేమో.. ఇప్పుడు కేవలం ఆధార్‌తో మీ అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. కొత్త రకం స్కామ్‌ను మోసగాళ్లు తెరలేపారు. మీరు సిమ్‌కార్డు కోసమో, రేషన్‌ కార్డు కోసమే ఇలా ఏ పని కోసమో మీ ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలు ఇచ్చే ఉంటారు. ఈ వివరాలను దొంగలించి.. బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఈ రకం స్కామ్‌ ద్వారా బ్యాంకు లూఠీ చేయడానికి మీ ఫోన్‌ నెంబర్‌, ఓటీపీ ఏం అవసరం లేదు. ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు ఉంటే చాలు. కాబట్టి ఆధార్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు మీ బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

బయోమెట్రిక్‌ వివరాలు ఎలా లాక్‌ చేయాలి..

https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి..మీ భాషను సెలెక్ట్ చేసుకోండి

మూడో ఆప్షన్‌ ఆధార్‌ సర్వీసెస్‌ అని ఉంటుంది. అందులో చివరన లాక్‌, అన్‌లాక్‌ బయోమెట్రిక్‌ అని ఉంటుంది.

అది క్లిక్‌ చేయండి.

లాక్‌ అన్‌ లాక్‌ ఆధార్ అని ఒక ఆప్షన్‌ ఉంటుంది. అది క్లిక్ చేయండి.

ఇప్పుడు మీకు థంబ్‌ సింబల్‌ ఉండి దాని కింద లాగిన్‌ అని ఉంటుంది. అది క్లిక్‌ చేయండి

ఇక్కడ మీ ఆధార్‌ నెంబర్‌ కింద ఉన్న క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయండి

మీ ఆధార్‌ కార్డుకు లింక్‌ అయిన మెబైల్‌కు ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తే.. నెక్స్‌ ఒక పేజ్‌ వస్తుంది. అందులో నెక్ట్స్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. మీ బయోమెట్రిక్‌ వివరాలు లాక్‌ అవుతాయి.

మీకు మెసేజ్‌ కూడా వస్తుంది..

మళ్లీ మీకు అవసరం ఉన్నప్పు సెమ్‌ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version