వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్‌ BA.2.86.. అప్రమత్తమైన WHO

-

కరోనా ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదనే విషయం తరచూ కొత్త వేరియంట్ కేసులు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ రకాలుగా కొవిడ్ రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు.

ఈ వేరియంట్‌ను బీఏ.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC).. దీన్ని ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది.

ఈ బీఏ.2.86 కొత్త రకంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని ‘వేరియంట్‌ అండర్‌ మానీటరింగ్‌’గా పేర్కొన్నామని తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని.. ప్రస్తుతం మూడు వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌లతోపాటు ఏడు వేరియంట్స్‌ అండర్‌ మానిటరింగ్‌లను ట్రాకింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version