కరోనా నేపధ్యంలో ఆ పో* సైట్ లో ఫ్రీగా వీడియోలు చూడవచ్చు….!

-

కరోనా వైరస్ దెబ్బకు ఇటలీ చుక్కలు చూస్తుంది. వైరస్ క్రమంగా చెలరేగిపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఆరు కోట్ల మంది ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. దీనితో అక్కడి ప్రజలను కాపాడుకోవడానికి ఇటలీ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుంది. ఇక అక్కడి స్వచ్చంద సంస్థలు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఒక శృంగార వీడియోలను ప్రసారం చేసే ఒక వెబ్ సైట్ కీలక నిర్ణయం తీసుకుంది. “ఫోర్జా ఇటాలియా, మేము నిన్ను ప్రేమిస్తున్నా౦. కరోనా వ్యాప్తి సమయంలో ఇటలీకి సహాయపడటానికి గాను పో* హబ్ మార్చి నుంచి మోడల్ హబ్ ప్లాట్‌ఫాం ద్వారా తన శాతం ఆదాయాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇంట్లో ఈ వారాలలో మీకు మేము సహాయం చేయడానికి మీ క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, నెల మొత్తం మీరు పో* ప్రీమియంను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చని పేర్కొంది.

ఈ పో* సైట్ ఏప్రిల్ 3 వరకు ఇటలీలో నివసించే ప్రజలకు తన ప్రీమియం సేవకు ఉచిత౦గా అందిస్తోంది. ఈ వెబ్‌సైట్ ప్రపంచంలోనే అతిపెద్ద శృంగార సైట్ గా పేరు పొందింది. గత సంవత్సరం 115 మిలియన్ల మంది 42 బిలియన్ సార్లు ఈ సైట్ ని ఎక్కువగా చూసారు. సగటు ఇటాలియన్ సైట్లో 10 నిమిషాల 5 సెకన్ల పాటు గడుపుతారని గుర్తించారు. కూడా ఇది గుర్తించింది. అమెరికా జపాన్ లో కూడా ఈ సైట్ కి మంచి ఆదరణ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news