లాఠీ కాఠిన్యం కాదు.. చైత‌న్యం కావాలి ! ప్ర‌జ‌లు కోరుతున్న‌ది ఇదే..!

-

ప్ర‌స్తుతం దేశం చాలా క్లిష్ట స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు సాయంత్ర‌మో.. రేపు ఉద‌య‌మో.. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000కి చేరుకునే అవ‌కాశం మెం డుగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో మృతుల సంఖ్య కూడా రెండు మూడు రోజుల్లోనే మూడు ప‌దుల‌కు చేరుకుంటుంద‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రం కొంత‌లో కొంత మెరు గ్గా.. ముందే మేల్కొని.. దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ విదించింది. ఇక‌, రాష్ట్రాల్లోనూ దేశ‌వ్యాప్తంగా కూడా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది.

అయితే, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌నే ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ.. నిత్యవ‌స‌రాలు, అత్యవ స‌ర సేవ‌లు వంటి కార‌ణంగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. మ‌న రాష్ట్రంలో జ‌న‌తా క‌ర్ఫ్యూ లేదా లాక్‌డౌ న్ విరామం విష‌యంలో ప్ర‌భుత్వం చాలానే రిలీఫ్ ఇచ్చింది. ఉద‌యం ఆరు నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు కూడా విరామం ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ.. కొన్ని ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కి వ‌స్తున్నారు. అయితే, ఈ స‌మ‌యంలో పోలీసులు తామున్న‌ది కేవ‌లం కొట్ట‌డం కోస‌మే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం తీవ్ర వివాదానికి, డిపార్ట్‌మెంట్‌పై ఉన్న సానుభూతిని పోగొట్టుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క‌నిపిస్తోంది. కానీ, కొట్ట‌డ‌మే ప‌రిష్కారంకాదు అనేది సామాజిక ఉద్య‌మ కారుల భావ‌న ఉంది. ప్ర‌స్తుతం విధించిన క‌ర్ఫ్యూకు ఏ మ‌త ఘ‌ర్ష‌ణ‌లో.. లేదా మ‌రో అసాంఘిక కార‌ణాలో కాదు. కేవ‌లం ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డ‌మే లక్ష్యంగా సాగుతున్న క‌ర్ఫ్యూ. ఈ నేప‌థ్యంలో ఇటు పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ కొట్ట‌డం కాకుండా ఎవేర్‌నెస్ క‌లిగించేందుకు ప్ర‌య‌త్నించాలి. అంత‌గా మితిమీరిన ఘ‌ట‌న‌లు జరిగిన‌ప్పుడు  బ‌ళ్లు స్వాధీనం చేసుకుని ఫైన్‌లు విధించ‌డం ద్వారా ప‌రిష్కారం చూపించ‌వ‌చ్చు.

సామాజిక శిక్ష‌లు విధించ‌డం కూడా పరిష్కారం కావొచ్చు.  కానీ, అలా చేయ‌డం మానేసి బ్రిటీష్ కాలంనాటి విధానాలే పాటిస్తామంటే ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్న‌వారే అవుతారు.(గ‌డిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై మేధావులు చెబుతున్న సూచ‌న‌లు ఇవే. కొస‌మెరుపు ఏంటంటే.. డీజీపీ స‌హా ఉన్న‌త‌స్థాయి అధికారులు కూడా ఇదే చెబుతున్నా.. డీఎస్పీ నుంచి దిగువ స్థాయి వారు మాత్రం రెచ్చిపోతున్నారు.)

Read more RELATED
Recommended to you

Exit mobile version