వణుకు పుట్టిస్తున్న మరో కొత్త వేరియంట్.. అమెరికా, బ్రిటన్‌లో కేసులు

-

కరోనా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా రకరకాలుగా తన రూపు మార్చుకుంటూ కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. కాస్త తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోగా మరో కొత్త రూపంలో అటాక్ చేస్తోంది. తాజాగా ఒమిక్రాన్ బీఏ.4.6 అనే కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెట్టడానికి మరోసారి ఎంట్రీ ఇస్తోంది.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లలో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. యూకేలో ఆగస్టు నెలలో పరీక్షించిన కొవిడ్‌ నమూనాల్లో 3.3శాతం ఈ వేరియంట్‌వే ఉన్నాయని బ్రిటన్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ తెలిపింది.

అటు అమెరికాలోనూ బీఏ.4.6 వేరియంట్‌ విస్తృత వ్యాప్తిలో ఉన్నట్లు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది. అక్కడ సీక్వెన్సింగ్‌ చేపట్టిన కేసుల్లో 9శాతానికి పైగా ఈ కొత్త వేరియంట్‌వే ఉన్నట్లు తెలిపింది. కేవలం అమెరికా, బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు సీడీసీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version