ఏపీలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్!

-

కరోనా నియంత్రణ విషయంలో ఏపీ సర్కార్ రకరకాల ఆలోచనలు అత్యంగ వేగంగా చేస్తుందనే అనుకోవాలి! ఇందులో భాగంగా… తాజాగా కేంద్రం నుంచి ఒక అనుమతి తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్! రోజు రొజుకీ ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా తాజాగా ఫ్లాస్మా థెరపీకి అనుమతి లభిందింది. అవును… కరోనా సోకి ప్రాణాలు పోయే చివరి దశలో ఉన్న వారిని “ఫ్లాస్మా థెరపీ”తో బతికిస్తున్నారన్న సంగతి తెలిసిందే!

వివరాళ్లోకి వెళ్తే… కరోనాను జయించిన రోగుల రక్తంలోని ప్లాస్మాను తీసుకొని కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు చికిత్స చేయడమే ప్లాస్మా థెరపి! ఈ చికిత్స ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మరణానికి దగ్గరైన కరోనా రోగులను బతికిస్తోంది. అయితే ఈ థెరపీ… మనదేశానికి వచ్చేసరికి ఢిల్లీలోని జయప్రకాష్ నారాయణ ఆస్పత్రిలో తొలిసారిగా పరీక్షింగా.. సత్ఫలితాలు వచ్చాయి. ఢిల్లీ అనంతరం తెలంగాణలోని గాంధీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో ఈ థెరపీకి ఇప్పటికే అనుమతులు దొరికాయి!

ఈ క్రమంలో కరోనావైరస్ తో చావుబతుకుల మధ్య వెంటిలేటర్ పైనున్న రోగులకు ఈ ఫ్లాస్మ థెరపీ చికిత్స చేస్తారు. తాజాగా ఈ ప్లాస్మా థెరపీని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయడానికి కేంద్రం సరే అంది. దీంతో ఈ థెరపీ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులోకి వస్తోంది!

కాగా… ఢిల్లీలోని జేపీ నారాయణ ఆసుపత్రిలో ఇప్పటికే నలుగురు రోగులకు ఈ ప్లాస్మా థెరపీ చేయగా.. వారు కోలుకోవడంతో దశల వారీగా దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో దీన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడం.. అమలుచేయడం కూడా జరిగిపోయాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ బృందం ఏపీపర్యటన అనంతరం రాష్ట్రంలో ఈ థెరపీని అమలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version